ఆదిలాబాద్ : భారత ప్రధాని ఇందిరా గాంధీ 35 వ వర్ధంతిని ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రం లో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత నివాసంలో కార్యకర్తలు, నాయకులూ ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాలులర్పించారు. అనంతరం ఆమె సేవలను నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా టీపీసీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత మాట్లాడుతూ.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఒక మహిళా ఎవరికి తీసిపోని విధంగా ఆమె పరిపాలన ప్రపంచ స్థాయిలనే గుర్తింపు పొంది ఒక ఉక్కు మహిళగా పేరుపొందిన మహనీయురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. ప్రజలకు అండగా నిలిచి అందరికి కూడు గుడ్డ, గూడు అనే నినాదం తో అందిరికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ఇందిరా ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇలా దేశ ప్రజలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలమడుగు జడ్పీటీసీ గణేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చెర్మెన్ సంజీవ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాపన్న, ప్రేమల, సులోచన, కోరెడ్డి శంకర్, రూపేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జైపాల్, మదుకర్, మాజీ ఎంపీటీసీ, పొచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు