ఈ నెల 15 నుండి ప్యాసింజరు రైళ్ళు

లాక్‌డౌన్‌ ఈ నెల 14వ తేదీతో ముగియనుండటంతో మరుసటి రోజు నుండి రైల్వే సర్వీసులను నడిపించనున్నారు. ఒకేసారి మొత్తం కాకుండా మొదట  ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలకు రైళ్ళను నడిపించనున్నారు. ఈ రైళ్ళతోపాటు దగ్గరి ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే సబర్బన్‌ రైళ్ళతోపాటు , లోకల్‌ రైళ్ళను కూడా ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తేవాలని  నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలపై ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే స్పష్టతకు వచ్చినట్లు రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. కరోనా ఉధృతి నేపథ్యంలో గత మార్చి 22 నుండి మార్చి 31వ తేదీ వరకు ప్యాసింజరు రైళ్లు నడువని ప్రకటించారు. లాక్‌డౌన్‌ తేదీ ఏప్రిల్‌ 14కు పెరుగడంతో ప్యాసింజర్‌ రైళ్ళ రద్దు తేదీనీ కూడా 14 వరకు కొనసాగుతుందని  ప్రకటించారు. అప్పటినుండి ఇతర రాష్ర్టాలు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు లేకుండా పోయాయి.